Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంఆ దేశాధ్యక్షుడిని అరెస్టు చేయిస్తే రూ.430 కోట్లు ఇస్తాం

ఆ దేశాధ్యక్షుడిని అరెస్టు చేయిస్తే రూ.430 కోట్లు ఇస్తాం

- Advertisement -

– వెనెజులా అధ్యక్షుడికి వెలకట్టిన అమెరికా
– అవన్నీ అభాండాలే : నికోలస్‌ మదురో

వాషింగ్టన్‌: వెనెజులా దేశాధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సహకరిస్తే రూ.430 కోట్ల సొమ్మును ఇస్తామని అమెరికా ఆఫర్‌ ప్రకటించింది. కొన్నేండ్లుగా తమకు కొరకరాని కొయ్యగా మారిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని ట్రంప్‌ కార్యవర్గం భావిస్తోంది. మదురో అరెస్టుకు అవసరమైన సమాచారం ఇచ్చినవారికి ఏకంగా 50 మిలియన్‌ డాలర్లు (రూ.430 కోట్లు) ఇస్తామని పేర్కొంది. తాజాగా అమెరికా అటార్నీ జనరల్‌ పామ్‌బాండీ ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. ”అమెరికాలో డ్రగ్స్‌ వ్యాప్తికి, హింసను ప్రేరేపించేందుకు నికోలస్‌ మదురో ట్రెన్‌ డె అరాగువా, సినలో, కార్టల్‌ ఆఫ్‌ ది సన్స్‌ వంటి వాటిని వినియోగిస్తున్నారు” అని పేర్కొన్నారు. నికోలస్‌ మదురో ఆయన సన్నిహితులకు సంబంధించిన 30 టన్నుల కొకైన్‌ను ఇప్పటివరకు తమ డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ సీజ్‌ చేసినట్టు బాండీ వెల్లడించారు. వీటిల్లో ఏడు టన్నులతో స్వయంగా మదురోకు సంబంధం ఉందని ఆరోపించారు. వెనెజులా, మెక్సికో కేంద్రంగా పనిచేసే డ్రగ్‌ సంస్థలకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారిందన్నారు. మదురోకు కేవలం కొకైనే కాకుండా ఫెంటెనిల్‌ స్మగ్లింగ్‌తో కూడా సంబంధాలున్నాయని బాండీ ఆరోపించారు. ఇప్పటికే 2020 మార్చిలో ఆయనపై దక్షిణ న్యూయార్క్‌ డిస్ట్రిక్ట్‌లో కేసులు నమోదైనట్టు చెప్పారు. ట్రంప్‌ నాయకత్వం నుంచి మదురో తప్పించుకోలేరని హెచ్చరించారు. వాస్తవానికి ట్రంప్‌ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మదురోపై 15 మిలియన్‌ డాలర్ల రివార్డును ప్రకటించారు. తర్వాత బైడెన్‌ కార్యవర్గం దానిని 25 మిలియన్‌ డాలర్లకు పెంచింది. ఇప్పటికే అమెరికాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ మదురోకు సంబంధించిన 700 మిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేసింది. వీటిల్లో ప్రయివేట్‌ జెట్‌లు, తొమ్మిది వాహనాలు ఉన్నాయి. అమెరికా చేస్తున్న ఆరోపణలను వెనెజులా అధ్యక్షుడు ఖండించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img