Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంత్వరలో టీవీవీపీ అప్‌గ్రేడ్‌

త్వరలో టీవీవీపీ అప్‌గ్రేడ్‌

- Advertisement -

మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

త్వరలో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ)ను సెకెండరీ హెల్త్‌ డైరెక్టరేట్‌గా టీవీవీపీ అప్‌గ్రేడ్‌ చేయనున్నట్టు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రొఫెసర్లకు, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పించిన నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు శుక్రవారం మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి టీవీవీపీలో ఖాళీగా ఉన్న సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) 1,690 డాక్టర్‌ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. నాన్‌ టీచింగ్‌ విభాగంలో డీఎంఈ, డీహెచ్‌, టీవీవీపీల్లో టైం బాండ్‌ ప్రమోషన్ల భర్తీలో వయోపరిమితి పెంపుపై కామన్‌ నిబంధనలు రూపొందించటానికి ఎక్సపర్ట్‌ కమిటీ నియమిస్తామని తెలిపారు. మంత్రి నిర్ణయాలను డాక్టర్ల సంఘం ప్రతినిధులు స్వాగతించారు. సెకెండరీ హెల్త్‌గా అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. డాక్టర్ల పోస్టుల భర్తీకి మెడికల్‌ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. డాక్టర్ల సమస్యలపై ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో అసోసియేషన్‌ అధ్యక్షులు డాక్టర్‌ నరహరి, సెక్రెటరీ జనరల్‌ డాక్టర్‌ లాలు ప్రసాద్‌, నాయకులు డాక్టర్‌ రవూఫ్‌, డాక్టర్‌ వినరు కుమార్‌, డాక్టర్‌ గోపాల్‌, డాక్టర్‌ క్రాంతి, డాక్టర్‌ అశోక్‌, డాక్టర్‌ రామ్‌ సింగ్‌ లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img