Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅలీబాబా 40 దొంగల్లాకల్వకుంట్ల కుటుంబం

అలీబాబా 40 దొంగల్లాకల్వకుంట్ల కుటుంబం

- Advertisement -

అందులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఒకరు :టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

అలీబాబా 40 దొంగల్లా కల్వకుంట్ల కుటుంబం దోపిడీకి పాల్పడిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి విమర్శించారు. అందులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఒకరి అని చెప్పారు. ఆ దొంగలకు కేసీఆర్‌ కుటుంబానికి పెద్ద తేడా లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌ అని ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుని నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈ దొంగల్లో ప్రభాకర్‌ రెడ్డి కూడా ఓ దొంగ అని విమర్శించారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీలో లిక్కర్‌ దుకాణం తెరిచారని ఆరోపించారు. కవిత, కేజ్రీవాల్‌ కథ ముగిందన్నారు. పెద్దమ్మ గుడి కమాన్‌ నుంచి మాదాపూర్‌ దాకా రాత్రి రెండు గంటల వరకు లిక్కర్‌, పబ్బు దందాలు కేటీఆర్‌ బావమరిది సంతోష్‌వేన్నారు. రూ. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.30 వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లు ఇచ్చిన డబ్బులను లెక్కలేసుకునేందుకే కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్‌కు ఎవర్ని రానివ్వడం లేదని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి ‘నీవ్వెంత నీ బతుకెంతా’? తన గురించి మాట్లాడే నైతికత ఉందా? అని ప్రశ్నించారు. ఆయన మాదిరిగా తాను ప్యాకేజీ లీడర్‌ను కాదన్నారు. ఆయన దగ్గరున్నంత ఆస్తి తన దగ్గరుంటే రైతులకు పంచుతానన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మంత్రులు రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజరుకుమార్‌ చేసిన వ్యాఖ్యలు అబద్ధమని చెప్పారు. కేంద్రమంత్రిగా ఆయనకు అవకాశం వచ్చిందనీ, రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్కటైనా చేయాలని ఆయన హితవు పలికారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img