Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఅన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ

- Advertisement -

మహిళలందరికీ సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని మహిళలందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందరూ ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరారు. మహిళల సాధికారతతోపాటు వారిని కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. గృహజ్యోతి, కొత్త రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరా క్యాంటీన్లు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులోనూ మహిళలకే పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలందరూ భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని వివరించారు. అక్కా చెల్లెళ్లందరికీ ఈ ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందనీ, అందరి దీవెనలతో విజయవంతంగా ప్రజాపాలన సాగిస్తుందని తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img