Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయం'హెడ్‌ నర్స్‌ పోస్టులు భర్తీ చేయాలి'

‘హెడ్‌ నర్స్‌ పోస్టులు భర్తీ చేయాలి’

- Advertisement -

నవతెలంగాణ-సుల్తాన్‌ బజార్‌
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రులలో దీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న హెడ్‌ నర్స్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూని యన్‌ (ఏఐటీయూసీ అనుబంధం) నగర అధ్యక్షులు ఎన్‌ శ్రీనివాస మూర్తి డిమాండ్‌ చేశారు. శుక్రవారం కోఠిలోని డీఎంఈ ఆవరణలో ఉన్న తెలంగాణ వైద్య విధాన పరి షత్‌ కార్యా లయం ముందు ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రులలో 50కి పైగా హెడ్‌ నర్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అధికారులు ఆలస్యం చేయడంపై నర్సు లు తమ పదోన్నతి కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన నర్సులకు హెడ్‌ నర్స్‌లుగా పదోన్నతి కల్పించాలన్నారు. ప్రభుత్వం, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌, అధికారులు ఈ సమస్యపై దష్టి సారించి వెంటనే భర్తీ చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి వేణు కుమార్‌, కార్యదర్శి ఎంసీఎస్‌ రాజు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img