Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంభారత్‌ నుంచి ఆర్డర్లు బంద్‌

భారత్‌ నుంచి ఆర్డర్లు బంద్‌

- Advertisement -

– నిలిపివేసిన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ సంస్థలు
వాషింగ్టన్‌ :
భారత్‌పై ట్రంప్‌ సుంకాల రెట్టింపు ప్రకటన తర్వాత అమెజాన్‌, వాల్‌మార్ట్‌, టార్గెట్‌, గ్యాప్‌వం టి ప్రధాన సంస్థలు ఆ దేశం నుంచి ఆర్డర్‌లను నిలిపివేసినట్టు సంబంధిత వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారతీయ వస్తువులపై 50శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తదుపరి నోటీసు వచ్చే వరకు వస్త్రాలు, ఫ్యాషన్‌ ఉత్తతులను నిలిపివేయాలని కోరుతూ అమెరికా సంస్థలు భారత ఎగుమతిదారులకు లేఖలు, మెయిల్స్‌ పంపినట్టు తెలిపాయి. అదనపు సుంకాల భారానికి భారత కొనుగోలుదారులు చెల్లించాలా లేదా అమెజాన్‌, వాల్‌మార్ట్‌ సంస్థలు భరించాలా అన్న అంశంపై స్పష్టత రావాల్సి వుందని పేర్కొన్నాయి. అధిక సుంకాల ఖర్చులను 30శాతం నుంచి 35 శాతం వరకు పెంచవచ్చని, దీంతో ఆర్డర్లు 40శాతం నుంచి 50శాతం తగ్గే అవకాశం ఉందని, సుమారు 4-5 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లవచ్చని తెలిపాయి.
భారత్‌లో వెల్స్పన్‌ లివింగ్‌, గోకల్దాస్‌ ఎక్స్‌పోర్ట్స్‌, ఇండో కౌంట్‌ మరియు ట్రైడెంట్‌ వంటి ప్రధాన ఎగుమతిదారు సంస్థలు అమెరికా అమ్మకాలతో 40 శాతం నుంచి 70శాతం వరకు లాభాలను ఆర్జిస్తున్నాయి. సుంకాల పెంపుతో అమెరికా నుంచి ఆర్డర్లు నిలిచిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారతీయ దుస్తులు, ఫ్యాషన్‌ ఉత్పతులకు అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుండి 36.61 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు వెళ్లగా, వాటిలో 28శాతం అమెరికాకే వెళ్లాయి. బంగ్లాదేశ్‌, వియత్నాం వంటి దేశాలపై అమెరికా 20శాతం మాత్రమే సుంకాలు విధించడంతో.. ఈ ఉత్పత్తుల కోసం భారత్‌కు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img