నులిపురుగులపై అవగాహన సదస్సు
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
ఇసామియా బజార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నులి పురుగులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్నేహక మాట్లాడుతూ నులి పురుగుల నివారణపై అంగ న్వాడి టీచర్లకు ఏఎన్‌ఎంలకు, ఆశ కార్యకర్తలకు మీటింగ్ నిర్వహించి శిక్షణ ఇచ్చారు. జాతీయ నులిపురుగుల నివా రణ కార్యక్రమం ఆగస్టు 11-18 వరకు నిర్వహించ నున్నట్టు ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగిందని తెలిపా రు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థులు ఉన్నారు. తద్వారా ఆల్బెండజోల్ 400 ఎం.జి. మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలి పారు. ఒక సంవత్సరము నుండి రెండు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలకు సగం టాబ్లెట్ చూర్ణం చేసి నీళ్లలో వేసి తాగించాలని సూచించారు. 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల పిల్లలకు పూర్తి టాబ్లెట్ చూర్ణం చేసి ఇవ్వాలన్నారు. 3 సంవత్సరాల నుండి 19 సంవత్స రాల వయసు పిల్లలకు పూర్తి ట్యాబ్లెట్ నమిలి మింగాలని కోరారు. పిల్లలలో నులి పురుగులు శరీరంలో ఉండడం వలన వారి శారీరక, మానసిక అభివద్ధి జరగకపోవడం, నీరసంగా, రక్తహీనతతో చదువుపై శ్రద్ధ లేకపోవడం మొదలగు లక్షణాలు కనిపిస్తాయన్నారు. జాతీయ నులి పురుగుల కార్యక్రమాని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఎన్ విజయమ్మ, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
11న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES