ఇంట్లో ఎవరూ లేకపోవడంతో
తప్పిన ప్రాణనష్టం
నవతెలంగాణ-ముషీరాబాద్
ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముషీ రాబాద్ నియోజకవర్గంలోని రామ్ నగర్‌లో ఒక పాత ఇల్లు కుప్పకూలింది. వర్షానికి పూర్తిస్థాయిలో తడవడంతో మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కూలిపోయింది. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం తో ప్రాణ నష్టం తప్పింది. ఇంట్లో సామాన్లు పూర్తిగా ధ్వం సం అయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నగేష్ ముదిరాజ్ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఆ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని కోరారు. ఇల్లు కూలిపోతే ఇప్పటివరకు రెవెన్యూ అధికారు లు, హైడ్రా, డిజాస్టర్ టీమ్స్ సంఘటనా స్థలానికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. నియోజకవర్గంలో శిథిలా వ్యవస్థలో ఉన్న భవనాలను గుర్తించి, వాటిని వెంటనే ఖాళీ చేయించి ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించాలని కోరారు. ఎప్పటికప్పుడు జీహెచ్‌ఎంసీ సిబ్బంది ప్రజలకు అండగా ఉండాలని సూచించారు.
భారీ వర్షానికి కుప్పకూలిన పాత ఇల్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES