– బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్న ప్రతిచోటా ఓట్ల తొలగింపు
– ఇప్పటికే బీహార్‌లో 62లక్షల ఓట్లు గల్లంతు
– ఈ ప్రక్రియతోనే ప్రతిపక్షంలో ఉండాల్సిన మోడీ ప్రధానిగా ఉన్నారు :
– సీపీఐ(ఎం) నిరసన కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్ : మోడీ ప్రభుత్వానికి ఏజెంటుగా ఎన్నికల కమిషన్ (ఈసీ) పనిచేస్తున్న దని సీపీఐ(ఎం) కేంద్ర కమిఓష సభ్యులు ఎస్ వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)’ను వ్యతిరేకి స్తూ కార్యక్రమాన్ని చేపట్టారు. గోల్కొండ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వరకు ర్యాలీ నిర్వహిం చిన అనంతరం జరిగిన నిరసన సభలో వీరయ్య మాట్లాడుతూ బీహార్‌లో అక్రమంగా, అప్రజాస్వా మికంగా 62లక్షల ఓటర్లను రకరకాల పేరుతో తొలగించే ప్రక్రియకు ఈసీ ఒడిగట్టిందని విమర్శించారు. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(సర్) పేరుతో ఒక్క నెలలోనే ఇన్ని ఓట్లను తొలగించిందని తెలిపారు. నిరుపేదలు, అసంఘటిత కార్మికులు, గ్రామీణ పేదలను ఓటర్ల లిస్టులో నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి ఓట్లు పడవని భావించిన ప్రతీ చోటా ఏదో ఒక పేరుతో వాళ్ల ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడు తున్నదని విమర్శించారు. ఇది అప్రజాస్వామిక చర్య అనీ, అందుకే సీపీఐ(ఎం) దీన్ని వ్యతిరేకిస్తున్నదని స్పష్టం చేశారు. దేశంలో ప్రతి పక్ష పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయని గుర్తుచేశారు. అయినా మోడీ ప్రభుత్వానికి ఏజెంటుగా వ్యవహరిస్తూ, ఊడిగం చేస్తున్న ఈసీ ఉలుకూ పలుకు లేకుండా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఇదొక కుట్ర పూరితమైన ప్రక్రియ అని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండాల్సిన మోడీ..ప్రధాన మంత్రి స్థానంలో ఉన్నారనే విషయాన్ని అనేక ఆధారాలు బట్టబయలు చేస్తున్నాయని వివరించారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో ఈసీ బీజేపీకి తొత్తుగా మారటం వల్ల, మోడీకి ఏజెంటుగా వ్యవహరించటం వల్ల పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఐదు కోట్లు అదనంగా ఉన్నాయని తెలిపారు. ఇది ఎన్నికల కమిషన్ ప్రకటించిన లెక్కేనని గుర్తు చేశారు. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎలా ఎక్కువగా ఉంటాయో.. సమాధానం చెప్పలేక ఈసీ నీళ్లు నములుతున్నదని విమర్శించారు. ఐదు కోట్ల ఓట్లు అదనంగా లెక్కించిన ఫలితంగా బీజేపీకి 70సీట్లు తోడ య్యాయని తెలిపారు. అదనపు ఓట్లు ఎక్కడ పోలయ్యాయో అక్కడ బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. ఓటింగ్ ముగిసే సమయానికి ప్రకటించిన పోలైన ఓట్లసంఖ్యకు తుది సంఖ్య కు చాలా తేడా ఉందని చెప్పారు. దేశ చరిత్రలో 1.2శాతం మించి తేడా లేదని తెలిపారు. కానీ..ఈసీ మోడీ జేబు సంస్థగా మారిన తర్వాత పది శాతం వరకు తేడా వచ్చిందని గుర్తు చేశారు. 24గంటల్లో తేల్చాల్సిన పోలింగ్ లెక్కలకు పది రోజుల సమయం తీసుకుంటున్న నియోజక వర్గాలు, రాష్ట్రాలున్నాయని వివరించారు. ఈ విషయం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, యూపీలో రుజువైందని గుర్తు చేశారు. మహారాష్ట్రలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఐదు మాసాల్లో కోటి ఓట్లు పెరిగాయని చెప్పారు. ఆయా నియోజక వర్గాల్లో జరిగిన తతంగాన్ని వెల్లడించా లనీ, సీసీపుటేజీలను బయటపెట్టాలని ప్రతిపక్ష పార్టీలన్నీ డిమాండ్ చేసినా పట్టించుకోవటం లేదని తెలిపారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ పద్ధతి ఆందోళన కలిగిస్తోం దని ఆవేదన వ్యక్తంచేశారు. బీహార్‌లో బీజేపీ ఓడిపోబోతు న్నదనే సంకేతాలతో సర్ పేరుతో 2003 తర్వాత ఓటర్లుగా ఉన్నవారి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలంటున్నారనీ, అంతటితో ఆగకుండా వాళ్ల తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలను అడుగుతున్నారని తెలిపారు. సాధారణ వ్యవసాయ, అసం ఘటిత కార్మికులకు బర్త్ సర్టిఫికెట్లు ఎక్కడి నుంచి వస్తా యని ప్రశ్నించారు. బీజేపీ ‘ఎన్నికల సంఘం అనుసరిస్తున్న ఈ తీరు వల్ల దేశంలో భయానక పరిస్థితులు తలెత్తుతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని కేవలం బీహార్‌కు సంబంధించిన విషయంగానే చూడొద్దని సూచించారు. రానున్న కాలం గడ్డుకాలంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశంలో ప్రజాస్వామ్యా నికి ముప్పు ఏర్పడిం దని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనా, ప్రజాస్వామిక వాదులపైనా ఉందన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం వెంకటేశ్ కార్యక్ర మానికి అధ్యక్షత వహించగా కార్యదర్శి వర్గ సభ్యులు పోతి -1నేని సుదర్శన్‌రావు, పాలడుగు భాస్కర్, బండారు రవికుమార్, రాష్ట్రకమిటీ సభ్యులు ఎంవీ రమణ, పి.ఆశయ్య, భూపాల్, బాబూరావు, నగర నాయకులు ఎం శ్రీనివాస్, ఎం శ్రీనివాస్‌రావు, మహేందర్, ఎం. దశరథ్, ఆర్ వెంకటేశ్, రంగారెడ్డి జిల్లా నాయకులు చంద్రమోహన్, కవిత, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
మోడీ ప్రభుత్వానికి ఈసీ ఏజెంటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES