Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeహైదరాబాద్ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం

ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం

- Advertisement -

టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పి.రాంరెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్‌

గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీయూజేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ప్రఫుల్‌ రాంరెడ్డి అన్నారు. శుక్రవారం చిక్కడపల్లిలో టీయూజేఏసీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్య క్షులు ప్రఫుల్‌ రాంరెడ్డి అధ్యక్షత వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు విస్తరించేలాగా జిల్లా కమిటీలు వేసి, ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కషి చేస్తామన్నారు. తెలంగాణ రెండో దశ ఉద్యమకారులపై పెట్టిన కేసులను బేషరతు గా కొట్టివేయాలని కోరారు. ప్రయివేటు సెక్టార్లలో అంద రూ ఆంధ్రావాళ్లు ఉండడంతో తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందన్నారు. టీయూజేఏసీ కరీంనగర్‌ జిల్లా మాజీ చైర్మెన్‌ మార్వాడి వెంకట మల్లయ్య మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వంలో తెలంగాణ కొరకు ఉద్యమించిన ఉద్యమ కారులకు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేస్తారని ఆశిస్తూ సమస్యల పరిష్కారానికి కార్యచరణ రూపొందించాలన్నా రు. 1969 తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం అనుభ వించిన ఎం.శంకర్రావు, హైకోర్టు అడ్వకేట్‌ కొంగల ప్రజ్ఞ త కుమార్‌, మాట్లాడుతూ ఉద్యమకారులకు నిర్మాణం నాయకత్వ లక్షణాల గురించి వివరించారు. ఈ ఉద్యమం నుండి నేర్చుకున్న అంశాలను గుర్తు చేసుకోవాలని కోరారు.రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెంకటస్వామి, ఉపా ధ్యక్షులు హరిప్రసాద్‌, సాయిలు, వగ్గిరాల సుజి, అంజలి కుమారి, రాష్ట్ర కార్యదర్శి లావణ్య, తదితరులున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img