Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeహైదరాబాద్ఈసీ వైఖరిని ఖండించండి

ఈసీ వైఖరిని ఖండించండి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
ఎండీ.అబ్బాస్‌
పార్టీ సౌత్‌ కమిటీ ఆధ్వర్యంలో ఐఎస్‌
సదన్‌ చౌరస్తాలో నిరసన
నవతెలంగాణ-ధూల్‌ పేట్‌

కేంద్ర ఎన్నికల కమిషన్‌ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తు న్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ. అబ్బాస్‌ విమర్శించారు. ఇది సరైన వైఖరి కాదని ఖండించారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ సౌత్‌ కమిటీ ఆధ్వర్యంలో సంతోష్‌ నగర్‌, ఐఎస్‌ సదన్‌ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్‌లో మంది 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ఎలక్షన్‌ లిస్టులో నుండి తొలగించడం అన్యాయమన్నారు. బీజేపీకి వ్యతిరేక ప్రాంతా ల్లో ఇలాంటి అన్యాయం జరుగుతుందన్నారు. ఇది అక్కడితో ఆగ కుండా మిగతా దేశమంతా విస్తరించే అవకాశం ఉంటుందని తెలి పారు. ఇలా భాష, మతం, కులం, ప్రాంతం.. వంటి అస్తితో ఉద్య మాలను సృష్టిస్తూ దేశభక్తి ప్రచారం ముసుగులో ప్రజల సమ స్యలను మర్చిపోతుందన్నారు. దేశ, సామాజిక విచ్ఛినానికి పాల్ప డుతున్న బీజేపీని నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి.నాగేశ్వరరావు, ఎం.మీనా, ఎం.శ్రావణ్‌ కుమార్‌, నాయకులు అబ్దుల్‌ సత్తార్‌, కిషన్‌, రామ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img