Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeనల్లగొండబీసీ రిజర్వేషన్ల దీక్షపై పోలీసుల ఓవర్‌ యాక్షన్‌

బీసీ రిజర్వేషన్ల దీక్షపై పోలీసుల ఓవర్‌ యాక్షన్‌

- Advertisement -

– అనుమతి లేదంటూ టెంట్‌ కూల్చివేత
– నాయకుల అరెస్ట్‌, విడుదల
– సీపీఐ(ఎం) కార్యాలయంలో దీక్ష కొనసాగింపు
– బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాలి
– ప్రజాస్వామ్యవాదులంతా ఈ అక్రమ అరెస్టులను ఖండించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి. జహంగీర్‌
నవతెలంగాణ – భువనగిరి
: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రిన్స్‌ చౌరస్తాలో శుక్రవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యం లో చేపట్టిన దీక్షాశిబిరం వద్ద పోలీసులు అత్యు త్సాహం ప్రదర్శించారు. అనుమతిలేదంటూ టెంట్‌ ను కూల్చేశారు. అక్కడ కూర్చున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జహంగీర్‌, జిల్లా నాయకత్వంతో పోలీసులు వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీస్‌స్టేషన్‌ నుంచి వచ్చిన నాయకులు దీక్షా శిబిరాన్ని సీపీఐ(ఎం) కార్యాలయానికి మార్చారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన దీక్ష కొనసాగించారు. ఈ సందర్భంగా జహంగీర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపితే ఇప్పటికీ ఆమోదించలేదన్నారు. ఈ రిజర్వేషన్లు చట్టబద్ధం కావాలంటే రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ముఖ్యమైనదన్నారు. పార్లమెంట్‌లో చర్చించి చట్ట రూపంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానిదన్నారు. ఈ విషయంపై తెలంగాణలో ఉన్న ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు నోరు మెదపడం లేదని విమర్శించారు. సీపీఐ(ఎం) నాయకుల అక్రమ అరెస్టులు, పోలీసుల తీరును జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, బూరుగు కృష్ణారెడ్డి, జెల్లెల పెంటయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిర్పంగి స్వామి, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, బోలగాని జయరాములు, బొల్లు యాదగిరి, బొడ్డుపల్లి వెంకటేష్‌, గంగదేవి సైదులు, మద్దేపూరం రాజు, గడ్డం వెంకటేష్‌, బల్గూరి అంజయ్య, కోట రామచంద్రారెడ్డి, నాయకులు వనంరాజు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img