Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్అందాల పోటీలను రద్దు చేయాలి..

అందాల పోటీలను రద్దు చేయాలి..

- Advertisement -

పోటీలను రద్దు చేయాలని పలు కాలనీలలో కరపత్రాలు పంపిణీ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ : రాష్ట్రంలో 7 నుండి జరగబోయే అందాల పోటీలకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఐక్యవేదిక పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, శనివారం  నగరంలోని పలు వార్డులలో పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక సభ్యులైన ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు గోదావరి, ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత,  ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు అంజలి, పిడిస్ యు జిల్లా కమిటీ సభ్యుడు మైపాల్ మాట్లాడుతూ..  తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో జరగబోయే అందాల పోటీలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదివరకు ఎప్పుడూ జరగని ఇలాంటి పోటీలను ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించడంలో అర్ధమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అనేక రకాల అగాయిత్యాలు మహిళలపై జరుగుతున్నాయి.  రోజు రోజుకి హింస పెరుగుతున్న క్రమంలో ఈ పోటీలు నిర్వహించడం కరెక్ట్ కాదని తెలిపారు. ఈ పోటీ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి లాభం లేదని, పెట్టుబడిదారులకు అమ్మాయిల అర్థనగ్న ఫోటోలతో బిజినెస్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప మరి దేనికి ఉపయోగపడవన్నారు. కాబట్టి దీన్ని రద్దు చేయాలని అన్ని మహిళా సంఘాలు కోరుకుంటున్నాయి.  లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యు జిల్లా కార్యదర్శి సంధ్య,  సునంద, పద్మ,ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి,  కళ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -