నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని మంజూరు చేయించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు, గాంధారి మండల ప్రజానీకం ముఖ్యంగా యువత తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు గాంధారి మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ తెలిపారు. గాంధారి గ్రామ శివారులోని 546 సర్వే నంబర్లో, 5ఎకరాల స్థలాన్ని కేటాయించి, ఎమ్మెల్యే మాట నిలబెట్టుకున్నారని గాంధారి మాజీ సర్పంచ్ ముమ్మాయి సంజీవ్ యాదవ్ అన్నారు.
గాంధారి మండల కేంద్రంలో ఇన్నాళ్లు సరైన ఆటస్థలం లేకపోవడంతో మండల కేంద్రానికి చెందిన యువకులు ఆటలు ఆడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎకరాలస్థలాన్ని మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు. మినీ స్టేడియం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించడంతో యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వారి తరపున ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మాజీ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ తెలిపారు.
మినీ స్టేడియం ఏర్పాటుకు స్థలం కేటాయింపు.. ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES