ఓబిసి నాయకుడు రాగం ఐలన్న యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో 42 శాతం బిసి బిల్లుకు ఢిల్లీలో పోరాటం గొప్పదని, ఇందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓబిసి పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సీనియర్ నాయకుడు రాగం ఐలయ్య యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో 42 శాతం బీసీ బిల్లుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రివర్గ బృందం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఓబీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలు, కుల సంఘాలు అందరు పాల్గొని కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బిసి డిక్లరేషన్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ వర్గాలకు న్యాయం చేసే విధంగా పోరాడుతున్నారు. ఢిల్లీలో పోరాటం చేసిన తెలంగాణ బీసీ సంఘాలు, కుల సంఘాలకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బీసీ బిల్లు ఆమోదం కోసం కాగ్రెస్ ప్రభుత్వ పోరాటం గొప్పది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES