Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంగిరిజన, వామపక్షాల ఆధ్వర్యంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

గిరిజన, వామపక్షాల ఆధ్వర్యంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
సీపీఐ(ఎం),సీపీఐ ఎంఎల్ ఎన్డీ మాస్ లైన్ అనుబంధ గిరిజన సంఘాలు,టీఏజీఎస్, తుడుందెబ్బ,ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంఘాలు జేఏసీ లు ఆద్వర్యంలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీఏజీఎస్ ఆద్వర్యంలో పండువారిగూడెం లో, అశ్వారావుపేట లోని కొమురం భీం విగ్రహం ప్రాంగణంలో సమావేశం అయిన తుడుందెబ్బ నాయకులు పలువురు మాట్లాడారు. సీపీఐ ఎంఎల్ ఎన్డీ మాస్ లైన్ ఆద్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుల్లయ్య,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చిరంజీవి,టీఏజీఎస్ నాయకులు సోడెం ప్రసాద్,మడకం గోవిందరావు,తుడుందెబ్బ అశ్వారావుపేట మండల  అధ్యక్షులు పాయం దుర్గారావు,ఆదివాసీ పెద్దలు మండల పరిషత్ మాజీ అద్యక్షులు బరగడ కృష్ణ,కట్రం స్వామి,వగ్గెల పూజ ,దొర , కంగాల ఆదినారాయణ,  పొట్టా దశరధయ్య,వాడే వీరస్వామి, కొరస వెంకటేష్ దొర  అలాగే  ఆదివాసి   ఉద్యోగ నాయకులు సున్నం నాగేశ్వరావు , మడివి కృష్ణారావు , పద్దం రాము, కుంజా సుబ్బారావు, మడకం వెంకటేశ్వర్లు, కొర్రి వెంకటేష్, కోపల గోవిందరెడ్డి, కదల రామిరెడ్డి,సి పి ఐ యంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రంగారెడ్డి, జిల్లా నాయకులు కంగాల కల్లయ్య పార్టీ  మండల నాయకులు బాడిస లక్ష్మణ్ రావు ,కంగాల భూలక్ష్మి, ధర్ముల శ్రీరాములు, పండ ముత్యాలు, కుంజా అర్జున్, కారం మల్లేష్ అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు వాసం పోతురాజు, మడకం రామకృష్ణ లు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img