నవతెలంగాణ – పెద్దవంగర
మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన గుంటుక మురళీ (36) గుండెపోటుతో ఇటీవల మృతి చెందారు. శనివారం కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.9 వేల ఆర్థిక సాయం అందించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు ఆవుల మహేష్ మాట్లాడుతూ.. మురళి అకాల మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. కష్టపడి పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి క్రియాశీలకంగా వ్యవహరించే యూత్ నాయకుడిని కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు. ఆయన గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొగలగాని రజనీకాంత్, ప్రధాన కార్యదర్శి మొగులగాని సోంమల్లు, వెంకన్న, రమేష్, హరీష్, సోమయ్య, దేవేందర్, రాము తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES