Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలి..

ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించాలి..

- Advertisement -

బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్
నవతెలంగాణ – మల్హర్ రావు

పాఠశాలకు రాకుండా ప్రైవేటు వ్యాపారాలు చూసుకుంటూ వేతనం పొందుతున్న పెద్దతూండ్ల జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల ఉపాధ్యాయుడు పిన్నింటి వెంకటేశ్వర్రావును వెంటనే విధుల నుంచి తొలగించాలని బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు జాగరి హరీష్ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విధులకు డుమ్మా కొడుతున్న ఆ ఉపాధ్యాయుడికి కొమ్ముకాస్తున్న జిల్లా సూపర్ డెంట్,డీఈవోను సస్పెండ్ చేయాలన్నారు. మంత్రి ఇలాకాలో ఇలాంటి డుమ్మా ఉపాధ్యాయుడు ఉండటం,మూడేళ్లుగా ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తుందన్నారు.విద్యార్థులకు అక్షరాలు నేర్పాల్సిన డుమ్మా ఉపాధ్యాయుడు బిల్డర్ గా అవతారమెత్తి ప్రభుత్వ సెలవుల్లో వేతనం పొందుతూ పాఠశాల వర్కింగ్ రోజుల్లో లాంగ్ లివ్ పెడుతూ అతని స్థానంలో వేకెన్సీ ఇవ్వకుండా చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం సిగ్గుచేటన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img