- Advertisement -
హెల్మెట్ వాడకంపై యువతకు అవగాహన..
నవతెలంగాణ – రెంజల్ : మండలంలోనీ సాటాపూర్ బైపాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు రెంజల్ ఎస్ఐ కే. చంద్రమోహన్ తెలిపారు. హెల్మెట్ వాడటం వల్ల కలిగే లాభాల గురించి స్థానిక యువతకు అవగాహన కల్పించారు. ఈరోజు హెల్మెట్ ధరించని వారితోపాటు, వాహనాల పత్రాలు సరిగా లేని 30 మందికి జరిమానాలు విధించినట్లు ఆయన తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు వ్యక్తులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన యజమానుల పై కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు.
- Advertisement -