– ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు
నవతెలంగాణ – కామారెడ్డి: రక్తదాన శిబిరానికి యువత కదిలి రావాలని ఐవిఎఫ్ సేవాదలరాష్ట చైర్మన్ డాక్టర్ బాలు అన్నారు. జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయినా మాట్లాడుతూ..బీబీపేట్ మండల కేంద్రంలోని వాసవి క్లబ్ లో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదివారం ఉదయం 09 గంటలకు కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఆఫ్ ఫెడరేషన్, వాసవి క్లబ్ ల సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా రావడం జరుగుతుందని తెలిపారు. వారి 53 వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేస్తున్న రక్తదాతలకు ప్రశంస పత్రాలను, స్టీల్ వాటర్ బాటిల్లను అందజేయడం జరుగుతుందన్నారు. మండలంలో ఉన్న రక్తదాతలు పెద్ద సంఖ్యలో విచ్చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ హైమద్,వాసవి క్లబ్ అధ్యక్షలు నాగభూషణం, కోశాధికారి రెడ్డిశెట్టి నాగభూషణం, మాజీ డిప్యూటీ గవర్నర్ దుద్దెల విశ్వప్రసాద్, అంతర్జాతీయ వాసవి కోఆర్డినేటర్ బాసెట్టి నాగేశ్వర్, బచ్చు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరానికి యువత కదిలి రావాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES