Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు బీమాకు రైతులు దరఖాస్తులు చేసుకోవాలి 

రైతు బీమాకు రైతులు దరఖాస్తులు చేసుకోవాలి 

- Advertisement -

వ్యవసాయ మండల అధికారిని పూర్ణిమ 
నవతెలంగాణ – కాటారం

జూన్ 05 నాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతులందరికీ రైతు భీమాకు దరఖాస్తులు చేసుకోవాలని కాటారం మండల వ్యవసాయ అధికారిని పూర్ణిమ రైతులకు తెలిపారు. ఆమె మాట్లాడుతూ కొత్తగా భూములు కొనుగోలు చేసి జూన్ 5 నాటికి రిజిస్ట్రేషన్ చేయించుకొని పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన 18 నుండి 59 సంవత్సరాలు కలిగి ఉన్న రైతులు రైతు బీమా కు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. భూభారతి, సీసీఎల్ ఏ లో నమోదైన రైతులకు అవకాశం ఉందని తెలిపారు. ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉండి గతంలో రైతు బీమాకు దరఖాస్తులు చేసుకొని రైతులకు అవకాశం ఉందని తెలిపారు.

గతంలో భీమాకు అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రైతు బీమాకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. ఈనెల 13 తో రైతు బీమా ముగియనుండడంతో పాత వాటిని పునరుద్ధరించడంతోపాటు నూతనంగా పట్టాదార్ పాస్ పుస్తకాలు కలిగి ఉన్న రైతులకు రైతు బీమాకు అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు.2025-26 సంవత్సరానికి సంబంధించిన రైతుబీమా ఈ నెల 14 నుంచి అమలు కావడంతో వ్యవసాయ శాఖ నూతనంగా మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు.

అర్హులైన రైతులు, కొత్త రైతు బీమా దరఖాస్తుదారులు ఏఈఓ లను సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రైతులు రైతు బీమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -