Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అంక్సాపూర్ పాఠశాలకు డ్యూయల్ డెస్కుల వితరణ 

అంక్సాపూర్ పాఠశాలకు డ్యూయల్ డెస్కుల వితరణ 

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
మండలంలోని అంక్సాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలకు చిట్టాపూర్ వాస్తవ్యులు ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యావేత్త శ్రీ ఏనుగు దయానంద రెడ్డి  20 డ్యూయల్ డేస్కులు సోమవారం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జిహెచ్ఎం శ్రీమతి ఆర్ మల్లీశ్వరి  మాట్లాడుతూ.. గతంలో  దయానంద రెడ్డి  పాఠశాల అవసరాలకు విద్యార్థులకు కావలసిన డ్యూయల్ డిస్కులు , సైన్స్ మెటీరియల్ కోసం వినతిపత్రం అందజేశారు.

ఈ మధ్యనే పాఠశాల పిడి దేవ సుకన్య అభ్యర్థన మేరకు పాఠశాలకు 20 డ్యూయల్ డెస్కులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం పిడిని అభినందించారు. శ్రీ దయానంద రెడ్డి  తమ ఉదార స్వభావంతో జిల్లాలో గల ఇన్ని పాఠశాలకు కావలసిన కనీస అవసరాలను తీర్చడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తమ పాఠశాలకు 20 డి ఎల్ డి స్కూల్ అందజేయడం చాలా ఆనందంగా ఉందని, వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం రవి చందర్ రఘునాథ్ జి సునీత కాంతయ్య శ్రీలక్ష్మి శ్రీదేవి యమునా, దేవరాజ్ రాజేంద్ర ,సదాశివ్, వినోద్, వేణుగోపాల్ రెడ్డి జాన్సన్ రాజు సిఆర్పి మూర్తి  విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img