Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, కొత్త ఇంటి నిర్మాణాలను త్వరగా ప్రారంభించాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. సోమవారం మండలంలోని నాగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని ఆయన పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని లబ్ధిదారులతోపాటు మేస్త్రీలకు సూచించారు. కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ముగ్గులు పోసుకున్న లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలను త్వరగా ప్రారంభించాలన్నారు.

ఇండ్లు మంజూరై ఇప్పటివరకు ముగ్గులు పోసుకొని లబ్ధిదారులు త్వరగా ముగ్గులు పోసుకొనే కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇండ్ల నిర్మాణంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం నూతనంగా లబ్ధిదారురాలి ఇంటి నిర్మాణానికి ముగ్గును ముగ్గును పోసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంధ్య, ఇందిరమ్మ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img