- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
నులిపురుగుల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి విద్యార్థికి ఆల్బెండజోల్ టాబ్లెట్లను తప్పనిసరిగా వేయించాలని హెడ్మాస్టర్ నిమ్మ రమేష్ అన్నారు. ‘ జాతీయ నులిపురుగుల నివారణ’ కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ హెచ్ఈవో లు రాజేందర్, కొండయ్య, సిబ్బంది ఆధ్వర్యంలో సోమవారం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లను వేశారు. ప్రైమరీ స్కూల్ టీచర్లు కరుణాకర్, సీహెచ్ మధుసూదన్ రెడ్డి, నవీన్, ఏఎన్ఎం రమాదేవి, ఆశా శ్యామల ఉన్నారు.
- Advertisement -