- Advertisement -
నవతెలంగాణ – పిట్లం
మండల లంబాడా హక్కుల పోరాట సమితి నూతన కార్యవర్గమును స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో సోమవారం ఎన్నుకున్నట్లు బాన్సువాడ డివిజన్ లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షులు సుభాష్ జాదవ్ తెలిపారు. మండల అధ్యక్షులుగా రాజు రాథోడ్ , ప్రధాన కార్యదర్శిగా అశోక్ , ఉపాధ్యక్షులుగా ప్రవీణ్ , సంయుక్త కార్యదర్శిగా అనిల్ , గౌరవ అధ్యక్షులుగా తుకారాం, ఆర్గనైజేషన్ సెక్రెటరీగా మా నిక్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రాజు రాథోడ్ మాట్లాడుతూ కార్యవర్గ సహకారంతో లంబాడా హక్కులను సాధనకై కృషి చేస్తూ ..లంబాడాల అభివృద్ధికై నిరంతరము కృషి చేస్తానని ఆన్నారు. ఈ కార్యక్రమంలో మండల బంజారా నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -