Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeనిజామాబాద్బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేయాలి

బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేయాలి

- Advertisement -

నవతెలంగాణ-కంఠేశ్వర్ 

బీసీ రిజర్వేషన్లను పార్లమెంట్లో చట్టం చేయాలి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం

జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో సీపీఐ (ఎం) పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం ఇంకా సామాజికంగా వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటానికి వారి జనాభా కనుగుణంగా రిజర్వేషన్లను అమలు జరపాలని డిమాండు ఉన్నప్పటికీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, గత దశాబ్దం పైగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం కానీ జనాభా కనుగుణంగా కులగణన చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని. ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కులగనన్న చేసి 42 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు జరపటానికి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలియజేసి తీర్మానాన్ని కేంద్రానికి పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ని అమలుకు చట్టం చేయకుండా ముస్లింల వంకతో బలహీనవర్గాలను నష్టం చేసే పద్ధతుల్లో పార్లమెంట్లో లేదని సీపీఐ (ఎం) పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన తెలిపారు. బీసీల్లోని అత్యధిక చెందినవారు విద్య, ఉద్యోగ ,రాజకీయ రంగాల్లో పూర్తిగా వివక్షతకు గురవుతున్నారని ఆయన అన్నారు. బీసీల పట్ల బిజెపి మోసపూరిత వైఖరిని విడనాడి రిజర్వేషన్ చట్టాన్ని అమలు జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరితో ప్రజలను మోసం చేస్తే క్షేత్రస్థాయిలో బిజెపి విధానాలను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం ఒంటరిగా పోరాటం చేయడం కాకుండా అఖిలపక్షాన్ని కలుపుకొని కేంద్రంతో పోరాడాలని అప్పుడే ప్రజలకు కేంద్రం వైఖరి అర్థం చేర్చడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లా నుండి ఎంపికైన పూరి అరవింద్ అదేవిధంగా బిజెపి ఎమ్మెల్యేలు కేంద్రం పైన బీసీ రిజర్వేషన్ల అమలు కోసం ఒత్తిడి తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, వెంకటేష్ మరియు జిల్లా కమిటీ సభ్యులు నన్నే సబ్, గంగాధర్, సుజాత, జంగం గంగాధర్, విగ్నేష్ తదితరులు మాట్లాడారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాయకులు నాయక్ వాడి శ్రీనివాస్, కటారి రాములు, అనసూయమ్మ, శ్రీదేవి, నరేష్, మహేందర్ , శేఖర్ గౌడ్, నరేష్ , ఒడ్డన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img