Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పిట్లంలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ 82 శాతం పూర్తి

పిట్లంలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ 82 శాతం పూర్తి

- Advertisement -

నవతెలంగాణ – పిట్లం
మండలంలో జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ 82 శాతం పూర్తయినట్లు ఆర్ బి ఎస్ కే డాక్టర్ అర్జున్ సోమవారము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అంగన్వాడి , ప్రాథమిక , ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలలో పాటు మహాత్మ జ్యోతిబాపూలే , కేజీబీవీ గురుకుల పాఠశాలలో ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలు 11,739 మందికి గాను 9,630 మంది పిల్లలకు డి వార్మింగ్ ట్యాబ్లెట్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మిగిలిన పిల్లలకు ఈనెల 18 మరోసారి డి వార్మింగ్ ట్యాబ్లెట్లను అందించడం జరుగుతుందన్నారు. డి వార్మింగ్ టాబ్లెట్లతో నులిపురుగులను నివారించవచ్చునని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ దేవి సింగ్ , ఎమ్మెల్యే హెచ్ పి సి హెచ్ ఓ హరి , సూపర్ వైజర్ యశోద , ఏఎన్ఎంలు సద్గుణ , చంద్రకళ , శంఖి , ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img