విపి గౌతమ్ ఐఏఎస్
నవతెలంగాణ – ధర్మసాగర్
ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు ఆపకుండా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండి వీ పి గౌతమ్ ఐఏఎస్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ నమూనా ఇల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏయ్ సుష్మ గారిని మండలంలోని ఇందిరమ్మ ఇండ్లు యొక్క ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. నిరుపేదలైన ఇందిరమ్మ లబ్ధిదారులు సకాలంలో నిర్మించుకుంటే బిల్లుల విషయంలో ఎలాంటి జాప్యం చేయకుండా అదేవిధంగా మండలంలోని ఇందిరమ్మ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమములో హౌసింగ్ పీడీ సిద్దార్థ్, డి ఈ రవీందర్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో అనిల్ కుమార్, ఎంపీఓ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.
నిర్మించుకున్న వారికి బిల్లులు ఆపకుండా ఇవ్వాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES