కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్
నవతెలంగాణ – పెద్దవంగర: బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. మండలంలోని గంట్లకుంట, కాన్వాయ్ గూడెం, రామోజీ తండా గ్రామాలలో యూత్ కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీలను శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని యువత అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, ఎండీ ముక్తార్ పాషా, ముత్తినేని సోమన్న, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకుల సమ్మయ్య గౌడ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES