Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుబీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఎన్నికల సంఘం..

బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఎన్నికల సంఘం..

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ..
నవతెలంగాణ – భువనగిరి

రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వతంత్ర  సంస్థ అన్న విషయాన్ని విస్మరించిన భారత ఎన్నికల సంఘం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి అనుబంధ సంస్థగా పనిచేస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బీహార్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం ఘరానా మోసాన్ని నిరసిస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో “నిరసన  తెలిపారు.

ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ.. భారత ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలని ఏ పార్టీకి  అనుబంధంగా పని చేయొద్దని అన్నారు. బీహార్లో భారత ఎన్నికల సంఘం చేసిన పని దేనికి సంకేతం అని వారన్నారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఓటు ఆయుధమని అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జులై 27న ఎన్నికల కమిషన్ విడుదల చేసిన పత్రిక ప్రకటనల మేరకు 7.24 కోట్ల ఎన్యుమరేషన్ ఈ నమోదు పత్రాలు సేకరించబడి రిజిస్టర్లో పేర్లు చోటు పొందాయనిన్నారు. 2025 జూన్ 24న ప్రత్యేక సమగ్ర సవరణ ( సర్) ప్రారంభించిన రోజున రాష్ట్ర ఓటర్ల జాబితాలో 7.89 కోట్ల ఓట్లు ఉన్నాయన్నారు. ఇప్పుడేమో ఓటర్ల సంఖ్య 7.24 కోట్ల అని చెబుతున్నారని 65.6 లక్షల ఓట్లు ఎట్లా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇంత మంది శాశ్వతంగా వలసపోయారని ఎలా నిర్ధారణకు వచ్చారని ఎన్నికల కమిషన్ను ప్రశ్నించారు.

ఈ వ్యవహారం చూస్తుంటే ఎన్నికల సంఘం బిజెపికి అనుబంధ సంస్థగా పనిచేస్తూ దేశంలో బిజెపి అన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. బీహార్ రాష్ట్రంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో 0 ఇంటి నెంబర్లతో 2.92లక్షల ఓటర్లు ఉన్నారన్నారు. బిజెపి దేశంలో అధికారంలోకి రావడానికి భారత ఎన్నికల సంఘాన్ని ఒక పావుగా ఉపయోగించుకొని అధికారంలోకి రావడానికి ప్రజలను మోసగిస్తూ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇటీవల కాలంలో జరిగిన మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో ఈ తంతే కొనసాగిందని ప్రజలు చర్చించుకుంటున్నారున్నారు. బీహార్ లో జరిగిన ఓటర్ల అవకతవకలపై విచారణ చేపట్టాలని నర్సింహ కోరారు. 

 ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ , మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య , మండల పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, వనం రాజు, అన్నంపట్ల కృష్ణ, కొండమడుగు నాగమణి, కమిటీ సభ్యులు అబ్దులాపురం వెంకటేష్, వల్దాస్ అంజయ్య, నాయకులు లావుడియ‌‌‌ రాజు,ఈర్ల రాహుల్, వేముల నాగరాజు, బుగ్గ ఉదయ్, మైసోల్ల నరెందర్, సతీష్, మహేష్,నేహాల్  పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img