Friday, September 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు.  ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యల పరిష్కారానికి 63 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగంపై విశ్వాసంతో ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు  ఎంతో ఇక్కడికి వస్తారని అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి దరఖాస్తులను ప్రతి ఒక్క శాఖ అధికారి  ప్రత్యేకంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, కలెక్టరేట్ ఏవో, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -