నవతెలంగాణ – పరకాల
గుడిసెలులేని తెలంగాణే ముఖ్యమంత్రి రేవంతన్న ధ్యేయమని మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ అన్నారు. సోమవారం పరకాల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో దుబాసి గౌరీ -భూపాల్ కి ఇటీవల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. వారి గృహ నిర్మాణానికి ముగ్గు పొసే కార్యక్రమంలో పాల్గొన్న సంపత్ కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
గుడిసెలు లేని తెలంగాణ నిర్మించాలని లక్ష్యంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా అట్టడుగు వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఆవాసం యువజన ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. మన ఆశలకు కొనసాగింపు కోసం రేవూరి ప్రకాష్ రెడ్డి కంకణబద్దులై, పరకాల నియోజకవర్గం పరిధిలో ప్రతి అర్హులైన పేదవాడికి ఇందిరమ్మ గృహాo మంజూరు చేస్తూ నిలువ నీడలేని ప్రజలకు అండగా నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గుడిసెలు లేని తెలంగాణే సీఎం రేవంత్ ధ్యేయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES