నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీని టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో కలిశారు. టిఎన్జీవోస్ పక్షాన మర్యాదపూర్వకంగా కలిసి, ఉమ్మడి జిల్లాల ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సానుకూలంగా స్పందించిన షబ్బీర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి, పరిష్కరించుటకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఇచ్చినందుకు కృతజ్ఞతలు టీఎన్జీవో ఎస్ ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల టీఎన్జీవో కోఆర్డినేటర్, ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి, టిఎన్జీవో ఇరు జిల్లాల జిల్లా కార్యదర్శులు నేతికుంట శేఖర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
షబ్బీర్ అలీని కలిసిన టిఎన్జీవోఎస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES