Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్యాదవ్ అమరవీరుల రీజ్లాంగ్ రజ్ కలశ యాత్రను విజయవంతం చేయాలి ..

యాదవ్ అమరవీరుల రీజ్లాంగ్ రజ్ కలశ యాత్రను విజయవంతం చేయాలి ..

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట
యాదవ్ అమరవీరుల రీజ్లాంగ్ రజ్ కలశ యాత్రను విజయవంతం చేయాలని శ్రీకృష్ణ సేవ ట్రస్టు చైర్మన్ డాక్టర్ రామూర్తి యాదవ్, అఖిల భారత్ యాదవ్ మహాసభ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మర్యాద సైదులు యాదవ్ అన్నారు. సోమవారం సూర్యాపేట లోని అఖిల భారత యాదవ్ మహాసభ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13న ఉదయం 10 గంటలకు సూర్యాపేట కు రెజంగ్లా రజ్ కలశ్ యాత్ర వస్తుందని తెలిపారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న కనకదుర్గమ్మ దేవాలయం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమై పాత బస్టాండ్ మీదుగా పొట్టి శ్రీరాములు సెంటర్, శంకర్ విలాస్ నుండి యాత్ర సాగి జ్యోతిరావు పూలె విగ్రహం వద్ద సమావేశం ఉంటుందన్నారు.

యాదవ్ లు భారీ గా తరలిరావాలని పిలుపు నిచ్చారు. 1962 భారత్ చైనా యుద్ధం లో 114 మంది యాదవ్ (అహిర్ )లు అమరులు అయ్యారు. వీరి త్యాగం మర్చిపోలేమన్నారు. అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లో అఖిల భారత యాదవ మహాసభ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తూము వెంకన్న యాదవ్, పెద్ద గట్టు చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్, వజ్జ వీరయ్యయాదవ్, గొడ్డెటి సైదులు యాదవ్, కోడి సైదులు యాదవ్, వేల్పుల లింగయ్య యాదవ్, నాగయ్య యాదవ్, సుంకర బోయిన వెంకన్న యాదవ్, బడుగుల సైదులు యాదవ్, బూడిగే మల్లేష్ యాదవ్, వేల్పుల రవీందర్ యాదవ్, కంచు గట్ల జానయ్య యాదవ్, గిరి యాదవ్, వెంకన్న యాదవ్, బండారు మలేష్ యాదవ్, కుర్ర సైదులు యాదవ్, కుర్ర నర్సయ్య ,ఉగ్గం బిక్షం యాదవ్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img