Sunday, May 4, 2025
Homeబీజినెస్సిగ్నిఫై ,సెల్కో ఫౌండేషన్‌ల భాగస్వామ్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సౌరశక్తి

సిగ్నిఫై ,సెల్కో ఫౌండేషన్‌ల భాగస్వామ్యంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సౌరశక్తి

- Advertisement -

లైటింగ్‌లో ప్రపంచ అగ్రగామి అయిన Signify (Euronext: LIGHT), సెల్కో (SELCO) ఫౌండేషన్‌తో కలిసి తన ప్రధాన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం ‘స్వాస్థ్య కిరణ్’ కింద కర్ణాటకలోని 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (PHC) విజయవంతంగా సోలరైజ్ చేసింది. ఈ పరివర్తనాత్మక ప్రయత్నంతో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో లైటింగ్, నమ్మకమైన విద్యుత్తుకు అంతరాయం లేకుండా సేవల అందుబాటును నిర్ధారించడం, పేదలకు ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను గణనీయంగా పెంచే లక్ష్యాన్ని కలిగి ఉంది. 

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 5 kWp సోలార్ ప్యానెల్, 19.2 kWh బ్యాటరీ, 6 kVA సోలార్ PCU అమర్చగా, కీలకమైన ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాలు, లైటింగ్, అవసరమైన వైద్య పరికరాలకు నిరంతర విద్యుత్ సరఫరాను ఇది హామీ ఇస్తుంది. ఈ ప్రయత్నంతో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏటా సుమారు 7,000 విద్యుత్ యూనిట్లు, మొత్తం 10 కేంద్రాలలో దాదాపు 70,000 యూనిట్లు ఆదా అవుతాయని అంచనా. దీనితో సంవత్సరానికి ₹4.5 లక్షల ఆర్థిక ఆదా అవుతుందని అంచనా వేయబడింది. అదే సమయంలో సంవత్సరానికి సుమారు 50 మెట్రిక్ టన్నుల కర్బన్ ఉద్గారాలు తగ్గిపోతాయి- మెరుగైన ఆరోగ్య సంరక్షణ సరఫరాతో పాటు పచ్చదనం, మరింత స్థిరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది.

ప్రారంభోత్సవంలో తుమకూరు జిల్లా ఆరోగ్య కార్యాలయం, టి.బి. అధికారి డాక్టర్ మోహన్‌దాస్, సిరా బ్లాక్ తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ సిధేశ్వర, గ్రామ పంచాయతీ ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్ట్  కీలక సహకారాన్ని వారు ప్రశంసించారు.

సిగ్నిఫై-గ్రేటర్ ఇండియా మార్కెటింగ్, వ్యూహం, గవర్నమెంట్ అఫైర్స్, మరియు సీఎస్ఆర్ విభాగాధిపతి నిఖిల్ గుప్తా ఈ ప్రాజెక్ట్ గురించి వివరిస్తూ, “సిగ్నిఫైలో, మా కార్పొరేట్ సామాజిక బాధ్యతల ప్రతయ్నతాల ద్వారా సముదాయాలపై సానుకూల ప్రభావాన్ని సృష్టించేందుకు మా లైటింగ్ నైపుణ్యాన్ని ఉపయోగించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. మా స్వాస్థ్య కిరణ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రాజెక్ట్ గ్రామీణ కర్ణాటకలో కీలకమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు శక్తినివ్వడానికి నమ్మకమైన మరియు స్థిరమైన శక్తిని అందించడం ద్వారా ఈ నిబద్ధతకు ఉదాహరణ. లక్షలాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో సెల్కో ఫౌండేషన్‌తో భాగస్వామ్యం కావడం మాకు గర్వకారణం’’ అని పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -