Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఅచ్చంపేటలో నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకట స్వామి

అచ్చంపేటలో నూతన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకట స్వామి

- Advertisement -

నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణంలో రూ.3 కోట్ల ఖర్చుతో అత్యధిక అంగులతో నూతనంగా నిర్మించిన మునిసిపల్ కార్యాలయ భవనాన్ని నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ లు, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ లతో కలిసి రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖల మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి సోమవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మునిసిపల్ సేవలు అందించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని అత్యంత సుందరమైన భవనాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని, ఇలాంటి మున్సిపాలిటీ భవనాన్ని ఎక్కడ చూడలేదని మంత్రి తెలిపారు. ఇంతటి గొప్ప భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ నిర్మాణానికి ప్రత్యేక కృషి చేయడంతోనే భవనం సుందరంగా రూపుదిద్దుకుందని మంత్రి ఎమ్మెల్యేను అభినందించారు.

పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, పట్టణాలు గ్రామాల అభివృద్ధికి బాటలు వేసేలా కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో చెత్త సకాలంలో తొలగింపు, కాలువల శుభ్రత, తాగునీటి సరఫరాలో వ్యత్యాసాలు లేకుండా చూసేలా సంబంధిత శాఖల అధికారులు చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి నివాసానికి శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో కాలువలు, డ్రెయిన్‌లు క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని, ఇబ్బందులు ఎదురవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిత్య పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన మున్సిపల్ కౌన్సిలర్లకు సూచించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలు, రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, కార్మికులు, తదితర వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా చేసుకొని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇవి సామాజిక, ఆర్థిక ప్రగతికి తోడ్పడుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ‌ము ఇచ్చిన 6 గ్యారెంటీల‌ను తప్ప‌క అమ‌లు చేస్తామ‌ని, ఇందులో భాగంగా ఒక్కొక్క‌టిగా  నిరంత‌రంగా సంక్షేమ‌, అభివృద్ధి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. అలాగే ఇచ్చిన వాగ్దానంతో  అర్హులైన అందరికీ పథకాలు అందిస్తూ  ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కార్యక్రమాలు చేస్తున్నామని, ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌ను మెరుప‌రుస్తున్నామ‌న్నారు.

ప్రతి ఒక్కరికి కడుపునిండా తిండి పెట్టాలనే ఉద్దేశంతో  ఆహార భద్రత చట్టం తీసుకురావడం  జరిగిందని అన్నారు. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వల్ల నిరుపేదలు కడుపునిండా తిండి తినలేక పోవడానికి గ్రహించి నేటి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. మన రాష్ట్రంలో పండించిన సన్న వడ్లకు రూ.5 వందల బోనస్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ పండించిన సన్నబియ్యాన్ని ధనవంతుడు తింటున్న విధంగానే పేదలు తినాలన్న ఉద్దేశంతో  సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని వివరించారు. 

దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా పేదలకు రూ.5 లక్షలతో ఒక్కో ఇంటిని నిర్మిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్ల చొప్పున పేద ప్రజల సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం సహకారం చేస్తుందని మంత్రి తెలిపారు. రైతులకు రైతు భరోసా,రుణమాఫీ చేశామని తెలిపారు. గృహ‌జ్యోతి ప‌థ‌కం, గ్యాస్ ప‌థ‌కం, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో  ఎ క్కడ కూడా రాజీ పడకుండా అర్హులను గుర్తించి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడు లేని విధంగా మహిళలు అన్ని రంగాలలో ఆర్థిక అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిక్షత తో  ఉందని మంత్రి తెలిపారు. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న  ప్ర‌తి ప‌థ‌కాన్ని అర్హులైన ల‌బ్డిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్దికంగా అభివృద్ధి చేందాల‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఇన్చార్జి ఎస్పీ రావుల గిరిధర్, మున్సిపల్ చైర్మన్ జి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మురళి, స్థానిక ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img