Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeకరీంనగర్రవాణా శాఖలో రికార్డు వసూళ్లు..

రవాణా శాఖలో రికార్డు వసూళ్లు..

- Advertisement -
  • రూ. 96.96 లక్షల ట్యాక్స్, పెనాల్టీలు​
    నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
    రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారులు తమ పనితీరును వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో రికార్డు స్థాయిలో పన్నులు, జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపారు. ​జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, కార్యాలయ నిర్వాహకురాలు కల్పన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని రాష్ట్ర రవాణా కమిషనర్ సురేంద్ర మోహన్‌కు వివరాలు తెలియజేశారు.

    జిల్లా నుంచి మొత్తం 293 వాహనాలపై కేసులు నమోదు చేయగా, దీనికి గాను రాష్ట్ర రవాణా శాఖ నిర్దేశించిన రూ. 64 లక్షల లక్ష్యాన్ని అధిగమించి, 151% వసూళ్లతో రూ. 96,96,465 సేకరించినట్లు వివరించారు. జిల్లాలో ఇప్పటికీ 5088 సరుకు రవాణా వాహనాలు, ట్రాక్టర్ ట్రైలర్లు, ఇతర వాహనాలు పన్నులు చెల్లించలేదని అధికారులు తెలిపారు. ఈ వాహన యజమానులు స్వచ్ఛందంగా పన్నులు చెల్లిస్తే ఎలాంటి జరిమానా లేకుండా కట్టవచ్చని, లేకపోతే రవాణా శాఖ తనిఖీలలో పట్టుబడితే 200% జరిమానాతో పన్ను చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సరుకు రవాణా వాహనాలకు తప్పనిసరిగా బీమా, కాలుష్య నియంత్రణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.15 సంవత్సరాలు పూర్తి అయిన సొంత పనులకు వాడే ద్విచక్ర వాహనాలు, కార్లకు తప్పనిసరిగా గ్రీన్ ట్యాక్స్, వాహన బీమా, కాలుష్య పత్రాలతో పునరుద్ధరణ చేసుకోవాలనీ జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ పేర్కొన్నారు.
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img