నవతెలంగాణ – సదాశివనగర్
మండలం లోని మర్కల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో సోమవారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపల్ శోభారాణి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా మానసిక వైద్యాధికారి మాట్లాడుతూ.. విద్యార్థులు మానసిక ఒత్తిడి జయించాలని,ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలకు గురి కావద్దని అన్నారు. లైఫ్ స్కిల్స్ పై ప్రేరణ పొందాలని,పరీక్షల కాలంలో ప్రణాళిక బద్దంగా ప్రిపేర్ అవ్వాలని అవగాహన కల్పించారు.. ఎవరికైనా మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే తమను సంప్రదించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను సంప్రదించి ఆరోగ్య నిపుణులతో కౌన్సిలింగ్ పొందవచ్చన్నారు.RBSK M.O డా. మారుతి,CHO నాగరాజు, సోషల్ వర్కర్,ఉపాద్యాయులు,ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
మానసిక ఆరోగ్యంపై అవగాహన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES