- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం సందర్భంగా 45 అంగన్వాడి కేంద్రాలు, 33 ప్రభుత్వ పాఠశాలలు, 6 ప్రయివేటు పాఠశాలు, జూనియర్ కళాశాల, రెసిడెన్షియల్ పాఠశాలలో 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాలలోపు ఉన్నా 6623 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసినట్లు మెడికల్ అధికారి యేమిమా తెలిపారు. మాత్రలు వేసుకొని వారికి మరోసారి ఈనెల 18వ తేదీ నాడు మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకటరమణ, స్టాఫ్ నర్స్, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
- Advertisement -