ఐదేళ్ళపాటు తహశీల్దార్ ఆఫీసుకు చెప్పులరిగేలా తిరిగా
ప్రజావాణిలో బాధితుడు కలెక్టర్ విజయేంద్ర బోయికి వేడుకోలు
నవతెలంగాణ – నవాబు పేట
ధరణిలో తప్పినా భూభారతిలో అమలయ్యేనా అని సోమవారం లింగంపల్లి గ్రామానికి చెందిన ధరణి బాధితుడు శివరాములు అతని తండ్రి బిచ్చపు వార్ల ఎల్లయ్య అతని అన్న కోటయ్య లు గత 1986వ సంవత్సరం లో ఒక ఎకరం భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ తో పాత పాసుపుస్తకం ఉంది. దీంతో పాటు అతని అన్న కోటయ్య కూడా 2006వ సంవత్సరం లో కూడా ఒక ఎకరం భూమి కొని రిజిస్ట్రేషన్ చేసుకుని పాత పాసుపుస్తకం ఉంది. అయితే వారు చనిపోయిన సందర్భంగా విరాసత్ చేయమని గత రెవెన్యూ అధికారులకు సంప్రదించి సంబంధించిన పత్రాలను సమర్పించిన పట్టించుకోకుండా ఉన్నారని, కాలక్రమేనా రికార్డులను ఆన్లైన్ లో నమోదు చేసే క్రమంలో కూడా వారికి సంబంధించిన వివరాలను నమోదు చేయకపోవడం వల్ల పై వారికి ఉన్న రెండు ఎకరాల భూమిని ఆధునీకరణకు నోచుకోలేదు.
శివరాములు గత ఐదు సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులతో కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేదని ధరణిలో నమోదు చేయండి అని ఆర్ఎస్ఆర్ ఎక్టెంట్ లేదని చెప్పారు అని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న శివరాములు ఈ నెల 8న గాంధీ భవన్లో జరిగిన ఎంఎల్ఏ ఫిర్యాదుల విభాగానికి వెళ్లి తన గోడును చెప్పారు. ఎంఎల్యె అనిరుద్ రెడ్డి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ఉత్తరం ద్వారా ఆదేశించారు. తాము నిరుపేద కుటుంబానికి చెందిన వారమని నలుగురు అన్నా తమ్ముళ్ళమని అట్టి రెండు ఎకరాల భూమి మాత్రమే తప్ప మరే ఇతర ఆస్తులు లేవని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఆ బాధితుడు శివరాములుకు ఇకనైనా సమస్య పరిష్కారం అవుతుందని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ధరణిలో తప్పినా భూభారతిలో అమలయ్యేనా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES