- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: పాత పద్ధతిలోనే పదో తరగతి పరీక్షలు ఉంటాయని తెలంగాణ విద్యాశాఖ వెల్లడించింది. 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానం కొనసాగించాలని నిర్ణయించింది. పదో తరగతి పరీక్షల్లో 80 శాతం ఎక్స్‌టర్నల్ మార్కులు, 20 శాతం ఇంటర్నల్ మార్కులు కేటాయించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
- Advertisement -