Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్ : మండలంలోని లక్నపూర్ గ్రామంలో పశునైద్య, పశుసంవర్ధక ఆద్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను నిర్వహించినారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి కిరణ్ దేశ్ పాండే మాట్లడుతూ లక్నాపూర్ గ్రామంలో 224 పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేషమన్నారు. పశువుల పెంపకం దారులకు ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి తమ పశువులకు గాలి కుంటు వ్యాధి నివా టీకాలు వేయించాలనీ సూచించారు.  రోగాల బారిన పడకుండా, పశువుల పునరుత్పత్తి సామర్థ్యం తగ్గకుండా ఉండి పశువులకు ఆరోగ్యంగా ఉంటామని, ఎండకాలంలో పశువుల నీడపట్టున ఉంచాలని, మేత కొరకు ప్రొద్దున తీసుకొని వెళ్ళాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  విఎల్ఓ టి. వినిత, జేవిఓ కల్యాణి, విఏ మహమ్మద్ పాషా, గంగాధర్, శ్యామల, పుప్ప, మహేశ్వరి, సికిందర్ గోపాల మిత్ర బేగ్, పాడిరైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -