Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవచ్చు..

మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవచ్చు..

- Advertisement -

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మీ మాధవిలత..
నవతెలంగాణ – భువనగిరి

మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవచ్చునని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వీ. మాధవి లత సూచించారు.  సోమవారం 90 రోజుల మధ్యవర్తిత్వపు కాంపెయిన్ లో భాగంగా జిల్లా న్యాయ అధికార సంస్థ కార్యాలయంలో మధ్యవర్తిత్వ న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో  జిల్లా న్యాయ సేవలు సంస్థ కార్యదర్శి మాధవి లత మాట్లాడారు. న్యాయస్థానాలకు వెళ్లకుండా మధ్య వర్తిత్వ ప్రక్రియ ద్వారా వైవాహిక, వాణిజ్య,  సివిల్, డబ్బుకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుకోవచ్చును అని తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం,  డబ్బు ఆదా అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్బంగా మధ్యవర్తిత్వం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సభ్యులు నాయకం రమేష్ కుమార్, మధ్యవర్తిత్వ న్యాయవాదులు రాజిరెడ్డి, నాగేంద్రమ్మ, సత్యనారాయణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -