Monday, May 5, 2025
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి..

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి..

- Advertisement -

సిఐటియు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు..
నవతెలంగాణ – మునుగోడు
: మే 20న సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో ఆశా వర్కర్ల , గ్రామపంచాయతీ కార్మికులు  పాల్గొనేందుకు శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ఎంపీడీవో విజయ భాస్కర్ కు,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కు సమ్మె నోటీస్ ను అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్  కోడ్లుగా తీసుకొచ్చి వాటికి అమలుకు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు . కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన  కోడ్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుంది అని తెలిపారు . ఉద్యోగ భద్రత ఉపాధి కోల్పోతారు , కార్మిక శాఖ కూడా నిర్వీర్యం చేయబడుతుందని అన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేయాలని చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టేందుకు కార్మిక వర్గం సంబరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు . ఆశా వర్కర్లకు నేటికి కనీస వేతనం నిర్ణయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుంది.  తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని,  ప్రతి ఒక్క కార్మికుడు ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పగిళ్ల మధు , ఎర్ర అరుణ , జీడిమడ్ల దశరథ , లక్ష్మణ్ తదితరులు ఉన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -