అనారోగ్య, ఆర్థిక కారణాలతో ఇబ్బంది పడుతున్న మూడు కుటుంబాలకు రూ. 25 వేల చొప్పున సాయం
కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆయా కుటుంబాలు
నవతెలంగాణ – సిరిసిల్ల
అనారోగ్య, ఆర్థిక కారణాలతో ఇబ్బంది పడుతున్న మూడు కుటుంబాలకు కలెక్టర్ ఆర్థిక చేయూత అందించారు. అనారోగ్య, ఆర్థిక కారణాలతో తాము ఇబ్బంది పడుతున్నామని, తమను ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో తంగళ్ళపల్లి మండలం రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన దాసరి మల్లవ్వ, కోనరావుపేట మండలం కొలనూర్ గ్రామానికి చెందిన కుమ్మరికుంట కళావతి, వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన సింగం నర్సయ్య విన్నవించారు. ఆయా కుటుంబాల స్థితిగతులు చూసి చలించిన కలెక్టర్ … వెంటనే ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో కుటుంబానికి రూ. 25 వేల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో ఆయా కుటుంబాల బాధ్యులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అందజేశారు. వారంలోగానే తమకు ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ కు ఆయా కుటుంబాల బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు ఆర్థికంగా చేయూతనిచ్చిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES