Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రమాదకర ప్రదేశాలను గుర్తించాలి: ఎమ్మెల్యే

ప్రమాదకర ప్రదేశాలను గుర్తించాలి: ఎమ్మెల్యే

- Advertisement -

ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలి 
మూడు రోజుల్లో పూర్తి సమాచారాన్ని అందించాలి 
విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

వర్షాకాలం ని దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సమస్యతో ఏర్పడే ప్రమాదాలను నివారించేందుకు ప్రమాదకర ప్రదేశాలను వెంటనే గుర్తించి నివేదిక అందించాలని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్ద వంగర, జనగామ జిల్లా దేవరుప్పుల మండలాల విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ సమస్యలపై, ప్రమాదాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలను గుర్తించాలన్నారు. విద్యుత్ తీగలను తొలగించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.

విద్యుత్ సమస్యతో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలను గుర్తించాలని, ఇళ్లపై ఉన్న విద్యుత్ తీగలను గుర్తించి మూడు రోజుల్లో నివేదికను అందజేయాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ను అందించడంలో దృష్టి పెట్టాలన్నారు. లూజు లైన్లు ఉన్నచోట ప్రమాదాలను నివారించేందుకు మిడిల్ పోల్చును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ తీగల కు తగిలి చెట్లను తొలగించాలన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమంతంగా ఉండాలని, నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల నుండి ఎలాంటి ఫిర్యాదులు వచ్చిన పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనగామ డిఈ లక్ష్మీనారాయణ రెడ్డి, దేవరుప్పుల ఏడిఈ అనిల్ కుమార్, తొర్రూరు డిఈ బి రవి, ఏడిఈ చలపతిరావు, దేవరుప్పుల, సింగరాజు పల్లి, పెద్ద వంగర ఏఈలు నరసింహారెడ్డి, నరసింహులు, రమేష్ బాబు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img