Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుకాటారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

కాటారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండలంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుదెల శ్రీధర్ బాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

మండల కేంద్రంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన శ్రీపాద చిల్డ్రన్ పార్క్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అలాగే అంకుషాపూర్, నస్తురుపల్లి గ్రామాల్లో ఒక్కో గ్రామ పంచాయతీ కి రూ.50 లక్షల చొప్పున, మొత్తం రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. చిదినేపల్లి, గుండ్రాత్‌పల్లి, దామెరకుంట, రేగులగూడెం, వడిపిలవంచ, బూడిదపల్లి, ఇబ్రహీంపల్లి గ్రామాల్లో రూ.84 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంగన్వాడీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు చేశారు.

అలాగే కాటారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంకు రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న మరమ్మత్తు పనులను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎంపిడిఒ బాబు,గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఎఎంసి చైర్ పర్సన్ పంతకాని తిరుమల – సమ్మయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img