వర్షాకాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరవు. ఆ తర్వాత ఒక్కోసారి వాటి నుంచి దుర్వాసన కూడా వస్తుంటుంది. దుస్తులు వేసుకోవాలంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ప్రయత్నించండి.
వాష్ చేసే సర్ఫ్ లో కాస్త నిమ్మరసం కలపడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఉండే విటమిన్ సి దుర్వాసనను పోగొట్టి బ్యాక్టీరియాను చంపుతుంది.
దుస్తులు వాష్ చేసే డిటర్జెంట్ లో బేకింగ్ సోడా కలపడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దుర్వాసన తొలగిపోతుంది. ఇది మాత్రమే కాదు దుస్తులకు కంఫర్ట్ వంటివి ఉపయోగించడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి.
వర్షాకాలంలో దుస్తుల నుంచి దుర్వాసన పోగొట్టడానికి కర్పూరం బిళ్ళ కూడా ఉపయోగించవచ్చు. అది సువాసన వెదజల్లుతుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.
ఈ సింపుల్ చిట్కాలతో
- Advertisement -
- Advertisement -