Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్కనీస బ్యాలెన్స్‌ బ్యాంకుల ఇష్టం

కనీస బ్యాలెన్స్‌ బ్యాంకుల ఇష్టం

- Advertisement -

– ఆర్బీఐ గవర్నర్‌ మల్హోత్రా
న్యూఢిల్లీ :
బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వల నిర్ణయం బ్యాంకులకే వదిలేసినట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా తెలిపారు. గుజరాత్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మల్హోత్రా మాట్లాడుతూ.. ”కనీస బ్యాలెన్స్‌ ఎంత ఉండాలనేది బ్యాంకులు నిర్ణయిస్తాయి, ఆర్బీఐ దీనిని నియంత్రించదు. కొన్ని బ్యాంకులు రూ.10,000 నిర్ణయిస్తాయి. మరికొన్ని రూ.2,000 ఉంచుతాయి. కొన్ని కనీస బ్యాలెన్స్‌ నిబంధనను ఎత్తివేశాయి. ఈ అంశం ఆర్బీఐ నియంత్రణ పరిధిలోకి రాదు” అని అన్నారు. ఐసీఐసీఐ బ్యాంక్‌ మెట్రో, అర్బన్‌ ప్రాంతాల్లో కనీస బ్యాలెన్స్‌ను అడ్డగోలుగా రూ.10,000 నుంచి రూ.50,000కు పెంచింది. ఈ నిర్ణయం ప్రజలను బ్యాంకింగ్‌ వ్యవస్థకు దూరం చేయడమేనని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతోన్న వేళ ఆర్బీఐ గవర్నర్‌ స్పందన కూడా ప్రయివేటు బ్యాంకింగ్‌ వర్గాలకు అనుకూలంగా ఉండటం గమనార్హం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img