Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంసీఎస్‌ఆర్‌ కింద రూ.50 లక్షల విలువైన విద్యా పరికరాలు

సీఎస్‌ఆర్‌ కింద రూ.50 లక్షల విలువైన విద్యా పరికరాలు

- Advertisement -

– ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ఫౌండేషన్‌కు అందజేసిన ఎస్‌బీఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌) కింద ఏకలవ్య గ్రామీణ వికాస్‌ ఫౌండేషన్‌ (ఈజీవీఎఫ్‌)కు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.50 లక్షల విలువైన విద్యా పరికరాలను అందజేసింది. వీటిలో కంప్యూటర్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్స్‌ కూడా ఉన్నాయి. 2015లో ప్రారంభమైన ఈజీవీఎఫ్‌ లాభాపేక్ష లేకుండా వ్యవసాయం, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, ఆరోగ్యం, విద్య, కమ్యూనిటీ డెవలప్‌ మెంట్‌ ద్వారా సుస్థిర గ్రామీణాభివృద్ధి కోసం పని చేస్తున్న సంస్థ. ఈ సందర్భంగా ఎస్‌బీఐ చైర్మెన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి మాట్లాడుతూ బ్యాంకులు తమ లాభాల్లో తప్పనిసరిగా ఒక శాతం సీఎస్‌ఆర్‌ కోసం కేటాయించాలని ఆర్‌బీఐ నిర్దేశించిందని తెలిపారు. సీఎస్‌ఆర్‌ అమలులో ఎస్‌బీఐ లీడర్‌గా నిలిచిందని తెలిపారు. తమ బ్యాంకు సీఎస్‌ఆర్‌కు సంబంధించి ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నదని చెప్పారు. ఎస్‌బీఐ ఫౌండేషన్‌, 17 సర్కిల్‌ ద్వారా వీటిని అమలు చేస్తున్నట్టు తెలిపారు. యూత్‌ ఫర్‌ ఇండియా ఫెల్లోషిప్‌ ద్వారా 11 ఏండ్లు సేవలందిస్తున్నామని చెప్పారు. 80 నుంచి 100 మందిని ఎంపిక చేసి గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన తెలిపారు. గ్రామ సేవ కార్యక్రమం ద్వారా సంపూర్ణ గ్రామాభివృద్ధితో పాటు వికలాంగుల సాధికారతకు నైపుణ్య శిక్షణ, సహకారంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గా నిలిచిందన్నారు. ఎస్‌బీఐ సర్కిళ్ల ద్వారా పాన్‌ ఇండియా స్థాయిలో ఆరోగ్య సంరక్షణ, విద్య, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పని చేస్తున్నట్టు వెల్లడించారు. బ్యాంకు పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను దత్తత తీసుకుందనీ, పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచిందనీ, స్థానికంగా ఉపాధి కోసం రూరల్‌ సెల్ఫ్‌ ఎంప్లారుమెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌కు పెట్టుబడి పెట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి పట్ల ఎస్‌బీఐకి ఉన్న అంకితభావాన్ని తెలుపుతున్నాయన్నారు. వీటికి తోడు రెండు ఇ-వెహికిల్స్‌తో పాటు, వికారాబాద్‌ జిల్లా గింగుర్తి సందీపని గురుకుల్‌కు ఏఐ ఆధారిత కంప్యూటర్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు సహకరిస్తున్నట్టు తెలిపారు.
ఎస్‌బీఐ లేడీస్‌ క్లబ్‌ అధ్యక్షురాలు శ్రీదేవి సూర్య మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల్లోని స్వయం సహాయక బృందాలకు అవసరమైన వస్తువులు, కుట్టు మిషన్లు, గృహౌపకరణాలను అందజేశారు. ఈ గ్రూపులు గ్రామీణ కుటుంబాలు, అణగారిన వర్గాలకు చెందిన వారి భాగస్వామ్యంతో ఏర్పడినవి. వీరు తమ జీవనోపాధి కోసం ఆర్గానిక్‌ ఫార్మింగ్‌, చేతితో సబ్బులు, డిటర్జెంట్లు, హెర్బల్‌ ప్రొడక్ట్స్‌, ఔషధ ఆధారిత వస్తువులను తయారు చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img